IPL-2024లో మరో 13 మ్యాచ్ లు మిగిలి ఉన్న దశలో ఇప్పటికీ ‘ప్లే ఆఫ్స్’లో అడుగుపెట్టే జట్లేవో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు చేరువైనా అవి కూడా సులువుగా అడుగుపెడతాయా అన్న అనుమానాలూ ఉన్నాయి. కానీ ఆ నాలుగింటికే మేజర్ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ముంబయి ఇండియన్స్(MI) మాత్రం పూర్తిగా టోర్నీ నుంచి ఇక తప్పుకున్నట్లే.
కోల్ కతా నైట్ రైడర్స్ KKR :
11 మ్యాచుల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించిన KKR.. పాయింట్ల విషయంలో రాజస్థాన్ తో సమంగా ఉన్నా నెట్ రన్ రేట్ పరంగా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ జట్టుకు 36% ఛాన్సెస్ ఉండగా.. మిగతా మూడు మ్యాచుల్లో ఒకటి గెలిచినా చాలు ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టొచ్చు. జాయింట్ టాపర్ గా 62.5% గెలుపు అవకాశాలు దక్కించుకున్న KKR మిగతా మూడు మూడింట్లో ఓడితే మాత్రం కష్టమే. అప్పుడు నాలుగో ప్లేస్ లో ఢిల్లీ క్యాపిటల్స్ లేదా లఖ్నవూ సూపర్ జెయింట్స్ రిజల్ట్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే నైట్ రైడర్స్ ఓడటమనేది కేవలం 0.2% మాత్రమే.
రాజస్థాన్ రాయల్స్(RR) :
కోల్ కతా మాదిరిగానే 62.5% విజయాలు, 36% ప్లే ఆఫ్స్ ఎంట్రీ ఛాన్సెస్ ఉన్న జట్టు రాజస్థాన్ రాయల్స్. మిగిలిన మూడు మ్యాచుల్ని చేజార్చుకుంటే మాత్రం KKR తరహాలోనే అటు DC, ఇటు LSG గెలుపోటముల లెక్కలపై ఆధారపడాలి. కానీ మూడింటిని రాజస్థాన్ కోల్పోవడం కేవలం 0.4% మాత్రమే.
సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) :
బుధవారం లఖ్నవూనూ ఓడించిన తీరుతో టేబుల్లో మూడో స్థానానికి చేరుకున్న హైదరాబాద్.. ప్లేఆఫ్స్ ఛాన్స్ ను 74% నుంచి 94%నికి పెంచుకుంది. మిగతా మూడు ఓడటమన్నది 0.5% మాత్రమే కాగా.. ఒక్కటి గెలిచినా చాలు బెర్త్ ఖాయం.
చెన్నై సూపర్ కింగ్స్(CSK):
ఇక 11 మ్యాచ్ లే ఆడి 6 విజయాలతో 12 పాయింట్లు కలిగిన చెన్నై.. మిగతా మ్యాచుల్లో ఒకట్రెండు గెలిచినా SRHతో జాయింట్ గా నిలుస్తుంది. అప్పుడు టాప్-4 ఆధారంగా సులువుగా ప్లేఆఫ్స్ చేరుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్(DC) :
దాదాపుగా దారులు మూసుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం ఐదో ప్లేస్ లో ఉంది. మిగతా మ్యాచులు గెలిచినా టాప్-4ను చేరుకునే అవకాశం లేకపోవడంతో ఆ నాలుగు జట్లకు సంబంధించి మిగతా మ్యాచులపైనే DC భవితవ్యం ఆధారపడి ఉంది. ఆడిన పన్నెండింట్లో కేవలం 6 మాత్రమే గెలిచి 12 పాయింట్లతో ఉంది.
లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG) :
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ది ఢిల్లీ కథే. పన్నెండింట్లో 6 మాత్రమే గెలిచి 12 పాయింట్లతో ఉండటం ప్రతికూలం కాగా.. మిగతా ఐదు జట్ల ఆటతీరుపైనే LSG ప్లేఆఫ్స్ ఆధారపడి ఉంది.
మిగతా మూడు టీమ్స్ ఇలా :
RCBకి 8%, గుజరాత్ కు 8% పంజాబ్ కు 6% మాత్రమే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి.