
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ భారత మహిళా జట్టును ప్రశంసించారు. మహిళల వరల్డ్ కప్ గెలిచిన టీంకు స్వయంగా అభినందనలు తెలియజేశారు. సెమీఫైనల్ లో అద్భుత ఆటతీరుతో ఫైనల్లో అడుగుపెట్టి తొలిసారి కప్పు అందుకోవడం చరిత్రాత్మకమన్నారు. ప్రపంచ కప్ సాధించిన తీరును ఒక్కో క్రికెటర్ స్వయంగా ప్రధానికి వివరించారు. ప్రతి భారతీయుడు మిమ్మల్ని చూసి పొంగిపోతున్నారని హర్మన్ ప్రీత్ కౌర్ సేనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. 2017లో ఫైనల్లో ఓడిపోయామని, కానీ ఈసారి ట్రోఫీతో తీసుకువచ్చి దేశానికి కానుక అందివ్వాలని అనుకున్నామని హర్మన్ ప్రీత్ చెప్పింది.