
భారత్ లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఆతిథ్య జట్టు అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇప్పటివరకు 15 మ్యాచ్ లు పూర్తి కాగా.. పాయింట్లు, నెట్ రన్ రేట్ లోనూ టీమ్ఇండియా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ప్రపంచకప్ లో ఆడుతున్న 10 జట్లు మంగళవారం(అక్టోబరు 17) నాటికి మూడేసి చొప్పున మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాయి. భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ వరుసగా నాలుగు ప్లేస్ లను ఆక్రమించగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 5వ స్థానంలో, ఐదు సార్లు ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా 8వ స్థానంలో నిలిచాయి. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ టీమ్ లు ఆసీస్ కన్నా అగ్రభాగాన నిలవడం ఆశ్చర్యకరంగా మారింది. టీమ్ఇండియా, న్యూజిలాండ్ మాత్రమే ఓటమి ఎరుగని జట్లుగా స్థానం సంపాదించాయి.
టీమ్ ల వారీగా మ్యాచ్ లు, పాయింట్లను పరిశీలిస్తే…
| T | M | W | L | P | RR |
| IND | 3 | 3 | 0 | 6 | 1.821 |
| NZ | 3 | 3 | 0 | 6 | 1.604 |
| SA | 3 | 2 | 1 | 4 | 1.385 |
| PAK | 3 | 2 | 1 | 4 | –0.137 |
| ENG | 3 | 1 | 2 | 2 | –0.084 |
| AFG | 3 | 1 | 2 | 2 | -0.652 |
| BAN | 3 | 1 | 2 | 2 | -0.699 |
| AUS | 3 | 1 | 2 | 2 | -0.734 |
| NED | 3 | 1 | 2 | 2 | -0.993 |
| SL | 3 | 0 | 3 | 0 | -1.532 |