కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దంచికొట్టడంతో పంజాబ్ కింగ్స్(PBKS) భారీ స్కోరు చేసింది. తొలుత ప్రియాన్ష్ ఆర్య(47) బాగా ఆడినా ప్రభ్ సిమ్రన్(5), ఒమర్జాయ్(16), మాక్స్ వెల్(0) స్టాయినిస్(20) తొందరగా వికెట్లు పారేసుకున్నారు. కానీ అయ్యర్(97 నాటౌట్; 42 బంతుల్లో 5×4, 9×6) చివరిదాకా నిలబడి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతడు 27 బంతుల్లోనే 3 ఫోర్లు, నాలుగు సిక్సులతో 50 చేరుకున్నాడు. చివరి ఓవర్లో సెంచరీ చేసే అవకాశమున్నా మొత్తం ఆరు బాల్స్ ని శశాంక్ సింగ్(44 నాటౌట్; 16 బంతుల్లో 6×4, 2×6) ఆడాడు. సెంచరీ చేరలేదన్నమాటే గానీ శశాంక్ వీరబాదుడుకు ఆ ఓవర్లో 23 రన్స్ వచ్చాయి. మొత్తంగా పంజాబ్ 5 వికెట్లకు 243 పరుగుల స్కోరు చేసింది.