ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య సెంచరీ(103; 42 బంతుల్లో 7×4, 9×6)తో రెచ్చిపోవడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. ఈ ఒక్కడే నిలవగా, చెన్నై(CSK) బౌలర్ల దెబ్బకు ప్రభ్ సిమ్రన్(0), శ్రేయస్(9), స్టాయినిస్(4), వధేరా(9), మాక్స్ వెల్(1) వరుసగా క్యూ కట్టారు. కానీ చివర్లో శశాంక్ సింగ్(52 నాటౌట్), మార్కో యాన్సన్(34 నాటౌట్) జోడీతో PBKS 200 మార్క్ దాటింది. మొత్తంగా ఆ జట్టు 6 వికెట్లకు 219 పరుగులు చేసింది.