తొలుత బ్యాటింగ్ చేసి 243 పరుగుల భారీ స్కోరు చేసిన పంజాబ్… తర్వాత గుజరాత్ ను కట్టడి చేసింది. చివరి ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా పంజాబ్ బౌలర్లు విజయానికి బాటలు వేశారు. సుదర్శన్(74), గిల్(33), బట్లర్(54) ఆడినా.. చివర్లో రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. మరో 2 ఓవర్లున్న దశలో బట్లర్ ఔటయ్యాడు. కానీ ఆ రెండు ఓవర్లలోనే 44 పరుగులు చేయాల్సి వచ్చింది. రూథర్ ఫర్డ్(46) , తెవాతియా(6) జోడీ విజయాన్ని అందించలేకపోయింది. ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 232 పరుగులే చేసిన టైటాన్స్.. పంజాబ్ చేతిలో 11 పరుగుల పరాజయాన్ని చవిచూసింది.