పంజాబ్ కింగ్స్(PBKS) అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 111కే ఆలౌటైనా.. తర్వాత అదే రీతిలో కోల్ కతా(KKR)ను దెబ్బకొట్టింది. 62/3తో ఈజీగా గెలుపు దిశగా సాగిన నైట్ రైడర్స్.. 79కు చేరుకునేసరికి 8 వికెట్లు కోల్పోయింది. యజువేంద్ర చాహల్ 4 వికెట్లతో కోలుకోలేని రీతిలో దెబ్బతీశాడు. రఘువంశీ(37) టాప్ స్కోరర్. 15.1 ఓవర్లలో 95కే ఆలౌటైన కోల్ కతా.. 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.