సెషన్ సెషన్ కు ఆధిపత్యం చేతులు మారుతున్న ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ కు వర్షం దెబ్బ తగిలింది. వరుణుడి ప్రభావంతో మూడో రోజు సగం ఆటను కోల్పోవాల్సి వచ్చింది. సెకండ్ డే ఆట క్లోజ్ అయ్యే సమయానికి 4 వికెట్లకు 116 పరుగులతో ఉన్న ఆసీస్… థర్డ్ డే వర్షం ఆగిపోయాక బ్యాటింగ్ కు దిగింది. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే మిచెల్ మార్ష్(28) ఔటయ్యాడు. వోక్స్ బౌలింగ్ లో బెయిర్ స్టోకి చిక్కాడు. స్కోరు బోర్డుపై మరో 18 రన్స్ చేరగానే ఆరో వికెట్ గా క్యారీ(5) వెనుదిరిగాడు. 139 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కంగారూ జట్టును ఆదుకునేందుకు ట్రావిస్ హెడ్(77; 112 బంతుల్లో 7×4, 3×6) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. చివరి వరుస బ్యాటర్లంతా పెవిలియన్ చేరడంతో ఆసీస్.. 224 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. బ్రాడ్(3/45), వోక్స్(3/68), మొయిన్(2/34), వుడ్(2/66) వికెట్లు తీసుకున్నారు. 26 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ సాధించిన ఆస్ట్రేలియా… ఇంగ్లాండ్ కు 251 పరుగుల టార్గెట్ ను విధించింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టోక్స్ సేన.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 రన్స్ చేసింది. ఓపెనర్లు డకెట్(18), క్రాలీ(9) క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంగ్లాండ్ మరో 224 పరుగులు చేయాల్సి ఉంది.