టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ను చూసి తొలుత ఇదేం జిడ్డు(Slow) బ్యాటింగ్ అనుకున్నారు. అలా సాగింది మరి వాళ్ల ఆటతీరు(Game). 36కు మూడు వికెట్లు, 9.3 ఓవర్లకు 50 స్కోరు చేసిందంటేనే రాజస్థాన్ బ్యాటింగ్ ఎలా నడిచిందో అర్థమవుతుంది. కానీ ఆ తర్వాత మొదలైంది.. రియాన్ పరాగ్ పరాక్రమం. 150 అయినా దాటుతుందా అన్న పరిస్థితి నుంచి 185/5కు చేరుకుందంటే అది పరాగ్ ఇన్నింగ్సే. కానీ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మాత్రం 5 వికెట్లకు 173 వద్దే ఆగిపోయి 12 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.
పరాగ్ ఫటాఫట్…
ఆది(Beginning)లోనే 3 వికెట్ల పడ్డ టీమ్ ను తన ఆటతీరుతో పరాగ్(84; 73 బంతుల్లో 7×4, 6×6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(5), జోస్ బట్లర్(11), కెప్టెన్ సంజూ శాంసన్(15) ఔటైనా.. అశ్విన్(29), ధ్రువ్ జురెల్(20), హెట్ మయర్(14)తో కలిసి పరాగ్ ఆటాడుకున్నాడు.
ఢిల్లీ మళ్లీ…
తొలుత ఆధిపత్యం ప్రదర్శించినా చివరకు ఢిల్లీ తలవంచి కంటిన్యూగా రెండో ఓటమిని కొనితెచ్చుకుంది. వార్నర్(49), మార్ష్(23), రికీ భుయ్(0), కెప్టెన్ రిషభ్ పంత్(28), ట్రిస్టన్ స్టబ్స్(44), అభిషేక్ పోరెల్(9), అక్షర్ పటేల్(15) పరుగులు చేసినా ఢిల్లీని గట్టెక్కించలేకపోయారు. రాజస్థాన్ కు ఇది వరుసగా రెండో విజయం.