తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్(PBKS) 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్(RR) ప్రారంభంలో బాగానే ఆడినా మధ్యలో కంటిన్యూగా వికెట్లు కోల్పోయింది. 4 వికెట్లకు 113 పరుగులతో పటిష్ఠంగా కనిపించిన ఆ జట్టు 138కి చేరుకునేసరికి 7 వికెట్లు చేజార్చుకుంది. అయినా చివర్లో పరుగులు రాబట్టి గెలుపును సొంతం చేసుకుంది. 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 152 రన్స్ చేసిన రాజస్థాన్.. 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పంజాబ్ అవస్థలు…
ఓపెనర్లు అథర్వ తైదె(15), జానీ బెయిర్ స్టో(15), ప్రభ్ సిమ్రన్(10), శామ్ కరణ్(6), జితేష్ శర్మ(29), శశాంక్ సింగ్(9) ఆట చూస్తేనే పంజాబ్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఆరో వికెట్(Sixth Wicket)కు జితేశ్, లివింగ్ స్టోన్(21) జోడీ అందించిన 33 పరుగుల పార్ట్నర్ షిపే హయ్యెస్ట్. చివర్లో అశుతోష్ శర్మ(31; 16 బంతుల్లో 1×4, 3×6) విజృంభించాడు. ఆవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
వికెట్లు కోల్పోయి…
జైస్వాల్(39), తనుష్(24), శాంసన్(18), పరాగ్(23), జురెల్(6), హెట్ మయర్(27 నాటౌట్), రోమన్ పావెల్(11) పరుగులు చేశారు.