భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్స్ లతో గ్రౌండ్ ను ఉర్రూతలూగించి సెంచరీతో అదరగొట్టాడు. అయినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు బట్లర్, సంజూ శాంసన్ హాఫ్ సెంచరీలతో చివరి వరకు నిలబడి మ్యాచ్ ను తమ వశం చేసుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)… 3 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసినట్లు ఆడారు రాజస్థాన్ రాయల్స్(RR) ఆటగాళ్లు. అటు కోహ్లి సెంచరీ చేస్తే ఇటు బట్లర్ సైతం శతకంతో మెరిసి 189/4 చేసిన రాయల్స్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
వహ్వా విరాట్…
ఓపెనర్ విరాట్(113; 72 బంతుల్లో 12×4, 4×6) మరోసారి కళాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్(44; 33 బంతుల్లో 2×4, 2×6)లతో హోరెత్తిస్తూ తొలి వికెట్(First Wicket)కు 125 పరుగులు జత చేశారు. ఈ జోడీని విడదీయడానికి ఎంత ప్రయత్నించినా రాయల్స్ టీమ్ కు సాధ్యం కాలేదు. మాక్స్ వెల్(1), సౌరభ్ చౌహాన్(9) ఔటైనా ఆ ప్రభావం పెద్దగా పడకుండానే విరాట్ దుమ్ముదులిపాడు. అటు కోహ్లి ఐపీఎల్ లో 7,500 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డులకెక్కాడు.
రాయల్స్ రాజసం…
184 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్.. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కే జైస్వాల్(0) వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత మొదలైంది అసలు యుద్ధం. జోస్ బట్లర్(100 నాటౌట్; 58 బంతుల్లో 9×4, 4×6) సెంచరీ, సంజూ శాంసన్(69; 42 బంతుల్లో 8×4, 2×6) హాఫ్ సెంచరీతో టీమ్ ను గెలిపించారు. రెండో వికెట్ కు 148 పరుగుల పార్ట్నర్ షిప్ అందించారు. శాంసన్, రియాన్ పరాగ్(4), ధ్రువ్ జురెల్(2) ఔటైనా మిగతా లాంఛనాన్ని బట్లర్ పూర్తి చేశాడు. వరుసగా నాలుగో విజయంతో పాయింట్స్ టేబుల్లో రాజస్థాన్ టాప్ ప్లేస్ కు చేరుకోగా.. బెంగళూరుకు ఇది కంటిన్యూగా మూడో ఓటమి.