సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో రాజస్థాన్ రాయల్స్ తొలుత భారీ స్కోరు సాధిస్తే… 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా లక్నో పోరాటం మాత్రం ఆపలేదు. అయినా ఆ జట్టు విజయానికి దూరంగానే ఉండిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. టార్గెట్ ను అందుకోలేక లక్నో.. ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లకు 173 స్కోరు వద్దే నిలిచిపోయింది. దీంతో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది.
కెప్టెన్ ఇన్నింగ్స్…
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్(82; 52 బంతుల్లో 3×4, 6×6) సిక్సర్లతో చెలరేగాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(11) తొందరగానే ఔటైనా రియాన్ పరాగ్(43; 29 బంతుల్లో 1×4, 3×6)తో కలిసి 93 పరుగుల భాగస్వామ్యం(Partnership) జోడించాడు. షిమ్రోన్ హెట్ మయర్(5) ఫెయిలైనా చివర్లో ధ్రువ్ జురెల్(20; 12 బంతుల్లో 1×4, 1×6) బ్యాట్ కు పనిచెప్పడంతో మంచి స్కోరు నమోదైంది.
ప్రారంభంలోనే కష్టాలు…
194 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో.. క్వింటన్ డికాక్(4), దేవ్ దత్ పడిక్కల్(0), ఆయుష్ బదోని(1) ఇలా వచ్చి అలా వెళ్లడంతో కష్టాల్లో పడింది. రాజస్థాన్ పేసర్, న్యూజిలాండ్ కు చెందిన ట్రెంట్ బౌల్ట్ విజృంభణతో డికాక్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగితే, పడిక్కల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అటు బదోనిని బర్గర్ ఔట్ చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఆ ఇద్దరి ఔట్ తో…
చివరకు హుడా(26; 13 బంతుల్లో 2×4, 2×6) చాహల్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో 60 స్కోరు వద్ద నాలుగో వికెట్ చేజార్చుకుంది. రాహుల్(58; 44 బంతుల్లో 4×4, 2×6), నికోలస్ పూరన్(64 నాటౌట్; 41 బంతుల్లో 4×4, 4×6) ధనాధన్ హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. హార్డ్ హిట్టర్ పూరన్ క్రీజులో ఉన్నా బాల్స్ మాత్రం కరిగిపోతూనే ఉండటంతో చివరకు లక్నో చేతులెత్తేయాల్సి వచ్చింది.