లార్డ్స్(Lords)లో జరుగుతున్న మూడో టెస్టులో జడేజా(61 నాటౌట్) అండతో భారత పోరాటం ఆకట్టుకుంది. 193 పరుగుల టార్గెట్ తో చివరి రోజు 58/4తో ఆట మొదలుపెట్టి 82కే కీలక 7 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్(0), రాహుల్(39), కరుణ్(14), గిల్(6), ఆకాశ్(1), పంత్(9), సుందర్(0), నితీశ్(13) ఔటయ్యారు. 112/8 చూసి మ్యాచ్ పోయిందనకున్నారు. కానీ జడేజా పట్టువదలని విక్రమార్కుడిలా బుమ్రా(5; 54 బంతుల్లో)ను కాపాడుకుంటూ నిలబడ్డాడు. బుమ్రా ఔటైనా సిరాజ్ ను అండ చేసుకున్నాడు. గెలిచిందా, ఓడిందా అనే దాని కంటే.. చివరి వరకు పోరాటం అబ్బురపరిచింది. 170కి భారత్ ఆలౌటవడంతో ఇంగ్లండ్ కేవలం 22 పరుగులతో గెలుపొందింది. ఆర్చర్, స్టోక్స్ మూడేసి.. కార్స్ 2, వోక్స్, బషీర్ ఒకటేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లండ్ 2-1తో ఉంది. తొలి టెస్టు ఇంగ్లండ్, రెండో టెస్టు భారత్ గెలుచుకున్నాయి. https://justpostnews.com