వర్షం పడి ఓవర్లు కుదించిన మ్యాచ్ లో బెంగళూరు(RCB) బ్యాటర్లు చేతులెత్తేశారు. 33కే 5 వికెట్లు చేజారితే 42కు చేరేసరికి 7 వికెట్లు ఢమాల్ మన్నాయి. పంజాబ్ కింగ్స్(PBKS) బౌలర్లు పోటాపోటీగా వికెట్లు తీయడంతో.. RCB ఇక కోలుకోలేదు. సాల్ట్(4), కోహ్లి(1), పటీదార్(23), లివింగ్ స్టోన్(4), జితేశ్(2), కృణాల్(1).. ఇదీ బెంగళూరు బ్యాటర్ల కథ. అర్షదీప్, యాన్సన్, చాహల్, హర్ ప్రీత్ నలుగురూ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. టిమ్ డేవిడ్(50 నాటౌట్; 26 బంతుల్లో) ఒక్కడే బ్యాట్ కు పనిచెప్పడంతో RCB.. ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లకు 95 పరుగులు చేసింది.