ఆష్లే గార్నర్ ఆల్ రౌండ్ షో చూపినా చివరకు వృథా(Waste) అయింది. మహిళల ప్రీమియర్ లీగ్(WPL) ఆరంభ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) విజయం సాధించింది. వడోదరలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన గుజరాత్ జెయింట్స్(GG).. తొలుత బ్యాటింగ్ చేసి 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. బెత్ మూనీ(56), గార్నర్(79), డీండ్రా డాటిన్(25) ముగ్గురే రాణించారు. రేణుకాసింగ్ 2 వికెట్లు తీసుకుంది. తర్వాత RCB టీమ్ కెప్టెన్ స్మృతి మంధన(9), వ్యాట్ హాడ్జ్(4) తొందరగానే ఔటయ్యారు. కానీ ఎలిసా పెర్రీ(57) హాఫ్ సెంచరీతో ఆదుకుంది. రఘ్వీ బిస్త్(25) వెనుదిరిగినా రిచా ఘోష్ సూపర్ హాఫ్ సెంచరీతో ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. 23 బంతుల్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేయగా.. రిచా(64 నాటౌట్; 27 బంతుల్లో 7×4, 4×6), కనిక అహూజా(30 నాటౌట్; 13 బంతుల్లో 4×4) ధనాధన్ బ్యాటింగ్ తో RCB 202/4 చేసి ఆరు వికెట్ల ఘన విజయాన్ని అందుకుంది.