IPL ఆరంభ మ్యాచ్ లో బెంగళూరు(RCB) ఘనమైన బోణీ కొట్టింది. తొలుత ప్రత్యర్థిని మోస్తరు స్కోరుకే కట్టడి చేసింది. రహానె(56) ఫిఫ్టీతో కోల్ కతా(KKR) 174/8 చేసింది. ఆ తర్వాత మొదలైంది బెంగళూరు వీరవిహారం. సాల్ట్(56), కోహ్లి హిట్టింగ్ తో ఫస్ట్ వికెట్ కు 95 పరుగులు వచ్చాయి. సాల్ట్ ఔటయ్యాక కోహ్లి(59 నాటౌట్), పటీదార్(34) దూకుడు పెంచారు. 15వ ఓవర్లో రాణా బౌలింగ్ లో 4 ఫోర్లతో 19 పరుగులు పిండుకున్నాడు పటీదార్. అతడు ఔటైనా కోహ్లి పట్టుదలతో నిలిచి విజయాన్ని అందించాడు. కేవలం 3 వికెట్లే కోల్పోయి 16.2 ఓవర్లలో 177 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో RCB ఘన విజయం సాధించింది.