విరాట్ కోహ్లి(73 నాటౌట్; 54 బంతుల్లో), దేవ్ దత్ పడిక్కల్(61; 35 బంతుల్లో) ఫటాఫట్ ఇన్నింగ్స్ లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఘన విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాల్ట్(1), కెప్టెన్ పటీదార్(12) త్వరగా ఔటైనా.. 7 వికెట్ల ఘన విజయాన్ని అందుకుంది. కోహ్లి-పడిక్కల్ జంట 103 పరుగుల పార్ట్నర్ షిప్ జోడించడంతో RCB గెలుపు నల్లేరు మీద నడకే అయింది. అంతకుముందు ఏ ఒక్కరూ నిలవలేక పంజాబ్ కింగ్స్ 157/6కే పరిమితమైంది. ఆ టీంలో ప్రభ్ సిమ్రన్(33), శశాంక్(31) టాప్ స్కోరర్లు.