
గాయాల బారిన పడి జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. మళ్లీ టీమిండియా తరఫున మ్యాచ్ లు ఆడబోతున్నారు. ఈ ఇద్దరితో కూడిన 17 మంది సభ్యుల ఆసియా కప్ టీమ్ ను BCCI ప్రకటించింది. వెస్టిండీస్ టూర్ లో ఆకట్టుకున్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు ఆసియా కప్ లోనూ ప్లేస్ దక్కింది. రోహిత్ కెప్టెన్సీలో ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 17 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ జరగనుంది. హైబ్రీడ్ మోడల్ లో పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో మ్యాచ్ లు జరుగుతాయి. గత కొంతకాలంగా వరుసగా బ్యాటింగ్ లో ఫెయిల్ అవుతున్న వికెట్ కీపర్ సంజు శాంసన్ ఇక రిజర్వ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు.
జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్య(వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ