
వెస్టిండీస్ తో భారత్ కు రేపట్నుంచి వన్డే సిరీస్ మొదలవుతుంది. ఆసియా కప్ స్టార్టింగ్ కు ముందు టీమ్ ఇండియా ఆడే లాస్ట్ వన్డే సిరీస్ ఇదే. ఇప్పటికే విండీస్ గడ్డపై రెండు టెస్టుల టోర్నీని 1-0 నెగ్గిన భారత్ ఈ వన్డే సిరీస్ లోనూ సత్తా చాటాలని చూస్తోంది. రేపటి మ్యాచ్ తోపాటు ఈ నెల 29న జరిగే రెండో వన్డే కింగ్ స్టన్ లో.. థర్డ్ వన్డే ట్రినిడాడ్ లో ఆగస్టు 1న జరుగుతుంది. ఈ వన్డే టోర్నీ ముగిసిన తర్వాత రెండు జట్లు 5 టీ20ల సిరీస్ లో పోటీపడతాయి.
భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్య(వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్