ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు నేటి నుంచి వెస్టిండీస్ తో టీ20 సిరీస్ ఆడనుంది. పొట్టి ఫార్మాట్ లో గట్టి పోటీనివ్వగలిగే ఆటగాళ్లు విండీస్ జట్టులో ఉన్నారు. టెస్టు సిరీస్ లో పెద్దగా రాణించకున్నా వన్డే సిరీస్ లో ఆ టీమ్ ప్లేయర్లు సత్తా చూపారు. రెండో వన్డేలో టీమ్ ఇండియాను చిత్తుగా ఓడించారు. IPLలో సత్తా చాటిన కుర్రాళ్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ సహా యువ ఆటగాళ్లతో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా కనిపిస్తున్నది.
అటు వెస్టిండీస్ సైతం టీ20కి వచ్చేసరికి బాగా ఆడుతోంది. ఇప్పటికే పలు మేజర్ లీగ్ టోర్నీల్లో పాల్గొన్న ఆటగాళ్లు.. వాటిల్లో ప్రధాన పాత్ర పోషించారు. దీంతో ఈ టోర్నీ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.