మహిళా క్రికెట్ ప్రపంచకప్పులో నగదు బహుమతి(Prize Money)ని ICC భారీగా పెంచింది. భారత్-శ్రీలంక నిర్వహించే ఈ టోర్నీకి ఏకంగా 300% పెంచింది. ఓవరాల్ ప్రైజ్ మనీ 13.88 మి.డా.(రూ.122.5 కోట్లు) అయింది. 2022 న్యూజిలాండ్ వరల్డ్ కప్ లో 3.5 మి.డా. అందించారు. రెండేళ్ల క్రితం భారత్ లో జరిగిన పురుషుల కప్ లో 10 మి.డా. ఇవ్వగా.. ఇప్పుడది చెరిగిపోనుంది. ఈ 13వ ఎడిషన్ విజేత రూ.39.55 కోట్లు, రన్నరప్ రూ.19.77 కోట్లు అందుకుంటాయి. సెమీస్ లో ఓడితే రూ.9.89 కోట్లు, గ్రూప్ స్టేజ్ లో ఆడితే 2.5 లక్షల.డా. ముడతాయి. గ్రూప్ స్టేజ్ విన్నర్లకు అదనంగా 34,314 డాలర్లు దక్కుతాయి. సెప్టెంబరు 30న టోర్నీ మొదలవుతుంది.