టెస్ట్ మ్యాచ్ ను టీ20ల తరహాలో మార్చేశారు టీమ్ఇండియా ఆటగాళ్లు(Players). కేవలం 18 బంతుల్లోనే 50 రన్స్ పిండుకున్నారు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్. బంగ్లాదేశ్ తో కాన్పూర్లో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాళ్లు చెలరేగి ఆడారు. వర్షం వల్ల రెండు రోజులు(2, 3 వ రోజులు) పూర్తిగా ఆట తుడిచిపెట్టుకుపోగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 233కు ఆలౌటైంది.
బంగ్లా ఇన్నింగ్స్ లో మోమినుల్ హక్(107 నాటౌట్) ఒక్కడే చివరిదాకా నిలబడ్డాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్.. టీ20 మాదిరిగా దుమ్ము దులిపింది. కేవలం తొలి 3 ఓవర్లలోనే 50 రన్స్ సాధించింది. దీంతో… 26 బాల్స్ లో 50 స్కోరు చేసిన ఇంగ్లండ్ రికార్డును టీమ్ఇండియా తిరగరాసింది. చివరకు రోహిత్(23) ఔటైనా… జైస్వాల్ మాత్రం 31 బాల్స్ లోనే 10 ఫోర్లు, ఒక సిక్స్ తో వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.