టాస్(Toss)లు ఓడటంలో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. వరుసగా 12 వన్డేల్లో టాస్ ఓడిన జట్టుగా నిలిచింది. ఈ రికార్డు ఇప్పటిదాకా నెదర్లాండ్స్(11) పేరిట ఉంది. 2023 వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకు టీమ్ఇండియా డజను(Dozen) సార్లు టాస్ గెలవలేకపోయింది. 2011 మార్చి-2013 ఆగస్టు మధ్య నెదర్లాండ్స్.. ఈ రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పుడా రికార్డును భారత్ అధిగమించింది. 2023 నవంబరు 19న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో మొదలైన టాస్ ఓటమి.. ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది. దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ తో మూడు మ్యాచుల సిరీస్ ల్లో ఒక్కటీ మనకు కలిసి రాలేదు.
రోహిత్ దీ రికార్డే…
రోహిత్ శర్మ ఇప్పటివరకు 9 సార్లు టాస్ ఓడిపోయాడు. ఈ చెత్త రికార్డు సాధించిన లిస్టులో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. టాప్ ప్లేస్ లో ఉన్నాడు. వన్డేల్లో లారా వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు.