అభిమానులు తనను ‘కింగ్’ అని ఎందుకు పిలుచుకుంటారో విరాట్ కోహ్లి మరోసారి నిరూపించాడు. సమీప భవిష్యత్తులో ఎవరికీ సాధ్యం కాని రీతిలో సెంచరీల రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ‘క్రికెట్ గాడ్’ గా భావించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు(49)ని అధిగమించి నయా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 50వ సెంచరీని పూర్తి చేసుకుని అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్ గా చరిత్రకెక్కాడు. మరోవైపు వన్డేల్లో 13,000 పరుగులు పూర్తి చేసుకుని ప్రపంచంలోనే అత్యధిక రన్స్ చేసిన లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచాడు. సచిన్(18,426), కుమార సంగక్కర(14,234) తర్వాతి ప్లేస్ ఆక్రమించాడు. ఈ క్రమంలో రికీ పాంటింగ్(13,704) రికార్డును విరాట్ కోహ్లి బ్రేక్ చేశాడు. 463 మ్యాచ్ లకు 452 ఇన్నింగ్స్ లో 49 సెంచరీలు సాధిస్తే.. విరాట్ మాత్రం 290 మ్యాచ్ లకు గాను 278 ఇన్నింగ్స్ ల్లోనే 50 సెంచరీలు పూర్తి చేశాడు.
టాప్-5 సెంచరీ వీరులు
ఆటగాడు | దేశం | ఇన్నింగ్స్ | సెంచరీల సంఖ్య |
సచిన్ టెండూల్కర్ | భారత్ | 452 | 49 |
విరాట్ కోహ్లి | భారత్ | 279 | 50 |
రోహిత్ శర్మ | భారత్ | 253 | 31 |
రికీ పాంటింగ్ | ఆస్ట్రేలియా | 365 | 30 |
సనత్ జయసూర్య | శ్రీలంక | 433 | 28 |