ప్రపంచకప్ అనేది ఆటగాళ్లకు ఒక కళ. అన్నిరకాలుగా సాగితేనే ప్రపంచకప్ సొంతమవుతుంది. మొన్నటి వన్డే కప్పును చేజార్చుకున్న టీమ్ఇండియా(Team India) ఈసారి మాత్రం వదల్లేదు. నిన్న మ్యాచ్ ముగిసిన వెంటనే కోహ్లి రిటైర్మెంట్ ప్రకటిస్తే కాసేపటికి రోహిత్ సైతం అదే మాట చెప్పాడు. ఇప్పుడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఈ ఇద్దరితో జతకలిశాడు.
సంతోషంలో…
వాస్తవానికి ఇపుడున్న జట్టులో చాలామందికి వయసు మీద పడింది. సీనియర్ల వల్ల కొత్త కుర్రాళ్లకు చోటు దక్కట్లేదన్న విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కప్పు గెలిచిన జట్టులో ముగ్గురు సీనియర్లు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. కోహ్లి 125 మ్యాచుల్లో ఒక సెంచరీతో 4,188 రన్స్ చేశాడు. 159 టీ20లు ఆడిన రోహిత్ 5 సెంచరీలతో 4,231 పరుగులు చేశాడు. జడేజా 74 టీ20ల్లో 54 వికెట్లతోపాటు 515 రన్స్ తీశాడు.