కాలి పాదం చిట్లి ఇక సిరీస్ కే దూరమైన రిషభ్ పంత్(Rishabh Pant).. ఊహించని రీతిలో బ్యాటింగ్ కు దిగాడు. నిన్న 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రివర్స్ స్వీప్ ఆడి గాయపడ్డ పంత్.. రెండో రోజు మరో రెండు వికెట్లు పడ్డాక క్రీజులోకి వచ్చాడు. ఆట మొదలైన కొద్దిసేపటికే జడేజా(20) ఔటైతే, బాగానే ఆడుతున్న శార్దూల్(41) పోరాటం చాలించాడు. ఇక మిగిలింది వాషింగ్టన్ సుందర్ ఒక్కడే. అందుకే బ్యాటు పట్టాడు పంత్. అతడు గ్రౌండ్ లోకి వస్తున్న దృశ్యాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.