ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో నిలకడగానే ఆడిన భారత్.. అసలైన సమయంలో నాలుగు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిలదొక్కుకుంటున్న పంత్.. గాయపడి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అతడు మళ్లీ మైదానంలో అడుగుపెడతాడా అన్నది తేలాలి. జైస్వాల్(58), రాహుల్(46), సుదర్శన్(61) కుదురుకున్న దశలో ఔటయ్యారు. గిల్(12) మళ్లీ నిరాశపరిచాడు. ఇంకొద్దిసేపు ఆట మిగిలి ఉండగా.. టీమ్ఇండియా స్కోరు 250 దాటింది.