నాలుగో టెస్టులో భారత్ కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. రిషభ్ పంత్(Pant) పాదం ఎముక చిట్లడం(Fracture)తో ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చారు. దీంతో ఈ సిరీస్ కు అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ కు రానుండగా.. ఇక 10 మందితోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆట తొలిరోజైన నిన్న పంత్.. రివర్స్ స్వీప్ కు యత్నించి గాయపడ్డాడు. ఈనెల 31న మొదలయ్యే ఫైనల్ టెస్టుకు పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ రాబోతున్నాడు. ఇప్పటికే అర్షదీప్, నితీశ్ కుమార్, ఆకాశ్ దీప్.. గాయాలతో తప్పుకున్నారు. ఈ సిరీస్ లో అత్యధిక పరుగుల్లో పంత్ రెండో స్థానంలో ఉన్నాడు.