రిషభ్ పంత్ భారత్ కు ఎంత విలువైన ఆటగాడో, అతణ్ని BCCI ఎందుకంత జాగ్రత్తగా కాపాడుకుందో అతడి ఆటతీరు(Game) చూస్తేనే అర్థమవుతుంది. బ్యాట్ తో హిట్టింగ్, వికెట్ల వెనకాల క్యాచులే కాదు.. తన క్రికెట్ పరిజ్ఞానంతో అందరినీ ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో తను బ్యాటింగ్ చేస్తున్న టైంలో ప్రత్యర్థి ఫీల్డింగ్ సెట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఏం జరిగిందంటే…
మామూలుగా అయితే ఏ బ్యాటరైనా ఫీల్డర్ లేని చోటు చూసి బాల్ ను కొడతాడు. కానీ అందరిలా పంత్ కాదు మరి. ఫీల్డర్ లేని విషయాన్ని గమనించిన అతడు.. అతణ్ని రప్పించి మరీ సెట్ చేశాడు. మిడ్ వికెట్లో బంగ్లాదేశ్ ఫీల్డర్ లేని విషయాన్ని పంత్ గమనించాడు. వాస్తవానికి ఆ ఏరియాకు బంతిని ఆడి పరుగులు తీయొచ్చు. కానీ పంత్ అలా ఆలోచించలేదు. ఒకే చోట ఇద్దరు ఫీల్డర్లను గమనించి అందులో ఒకర్ని మిడ్ వికెట్ కు వెళ్లాలని చెప్పాడు. దీంతో వెంటనే ఆ ఇద్దరిలో ఒకరు మిడ్ ఫీల్డ్ కు పరుగెత్తాల్సి వచ్చింది. పంత్ చేసిన పనిపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తున్నది.