ఢిల్లీ క్యాపిటల్స్(DC) కెప్టెన్ రిషభ్ పంత్ కీలక మ్యాచ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. స్లో ఓవర్ రేట్(Slow Over Rate) కారణంగా అతడిపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగే మ్యాచ్ నుంచి పంత్ తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అతడి స్థానంలో అక్షర్ పటేల్ సారథి(Captain)గా ఉంటాడని హెడ్ కోచ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు.
కోడ్ ఉల్లంఘన…
IPL కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. ఈ నెల 7న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ పంత్ కు ఫైన్ పడింది. అయితే అప్పటికే అతడు రెండుసార్లు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇలా ఒకే సీజన్లో మూడు సార్లు కోడ్ ఉల్లంఘించడంతో రిషభ్ పై నిషేధం తప్పలేదు. 12 మ్యాచుల్లో 6 గెలిచి మరో 6 ఓడిన DC 12 పాయింట్లతో టేబుల్లో ఐదో స్థానంలో నిలిచింది. బెంగళూరుతో తప్పక గెలవాల్సిన గేమ్ నుంచి కీలక ప్లేయర్ అయిన పంత్ తప్పుకోవాల్సి రావడం ఆ టీమ్ కు ఇబ్బందికరమేనని మాజీ ఆటగాళ్లు అంటున్నారు.