
ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్(One Day Internationals) లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచకప్ లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ పై దుమ్ము దులిపిన రోహిత్.. తన పేరిట సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకున్నాడు. వరల్డ్ కప్ లో హయ్యెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 44 మ్యాచ్ ల్లో సచిన్(6) సెంచరీలు చేస్తే, రోహిత్ మాత్రం 19 మ్యాచ్ ల్లోనే 7 సెంచరీలు నమోదు చేసుకున్నాడు.
అత్యధిక సిక్సర్లు అతడి ఖాతాలోనే
అఫ్గాన్ పై రెండో సిక్సర్ సాధించగానే కెరీర్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి వరల్డ్ లో అత్యధిక సిక్స్ లు నమోదు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. వెస్డిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ నెలకొల్పిన 553 సిక్సర్ల రికార్డును చెరిపేశాడు. గేల్ 551 ఇన్నింగ్స్ ల్లో 553 సిక్సర్లు కొడితే, రోహిత్ మాత్రం 473 ఇన్నింగ్స్ ల్లోనే ఆ రికార్డును బీట్ చేశాడు. ఇక పసికూనతో జరిగిన మ్యాచ్ లో ఈ హార్డ్ హిట్టర్ తాజా వరల్డ్ కప్ లో రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ 53 రన్స్ చేస్తే.. కుశాల్ మెండిస్ 25 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు.
వేగంగా 1,000 పరుగులు
వన్డే వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా 1,000 రన్స్ చేసిన క్రికెటర్ గానూ రోహిత్ రికార్డులకెక్కాడు. ఈ ఆటగాడు కేవలం 19 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఇక 2023లో జరిగిన వన్డే మ్యాచ్ ల్లో తొలి 10 ఓవర్లలో రోహిత్ స్ట్రైక్ రేట్ 107గా ఉంది. ఇక అఫ్గాన్ పై 63 బాల్స్ లోనే సెంచరీ చేసి వరల్డ్ కప్ లో అత్యంత ఫాస్ట్ గా శతకం సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. 1983లో కపిల్ దేవ్ జింబాబ్వేపై 72 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును రోహిత్ తుడిపేశాడు.