భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్ సాధించాక పొట్టి ఫార్మాట్ వదిలిపెట్టిన అతడు.. టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఇంగ్లండ్(England)తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు ఎంపికయ్యే అవకాశాలపై అనుమానాలున్న వేళ.. టీమిండియా కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిపెట్టిన 38 ఏళ్ల రోహిత్.. ఇక వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడతాడు. బోర్డర్-గవాస్కర్ టోర్నీలో చెత్త ప్రదర్శన.. న్యూజిలాండ్, శ్రీలంకతో ఓటమి తర్వాత రోహిత్ కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి. 67 టెస్టుల్లో 40.57 సగటుతో 4,301 పరుగులు చేయగా.. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలున్నాయి.