తడబడుతూ, వరుసగా విఫలమవుతూ విమర్శల పాలవుతున్న రోహిత్ శర్మ(Rohit Sharma).. ఎట్టకేలకు బ్యాట్ కు పనిచెప్పాడు. ఇంగ్లండ్ తో రెండో వన్డేలో వేగంగా హాఫ్ సెంచరీ(Fifty) పూర్తి చేశాడు. మొదట్నుంచీ ధాటిగా ఆడుతున్న అతడు.. ఐదు సిక్సులు బాదాడు. ఈ భారత కెప్టెన్ 30 బంతుల్లో 4 ఫోర్లు, మరో నాలుగు సిక్సులతో అర్ధ సెంచరీ దాటాడు. మరో ఎండ్ లో గిల్(60; 52 బంతుల్లో 9×4, 1×6) నిదానంగా ఆడుతూనే చివర్లో స్పీడ్ పెంచి ఫిఫ్టీ చేరుకున్నాడు. రోహిత్ వరుసగా సిక్సులు బాదటంతో కటక్ లోని బారాబతి స్టేడియం మార్మోగిపోయింది. ఈ ఇద్దరి బ్యాటింగ్ తో రన్ రేట్ 8తో కొనసాగితే 16 ఓవర్లలోనే 130 రన్స్ వచ్చాయి.
సిక్సర్ల రికార్డు…
మ్యాచ్ కు ముందు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్(331 సిక్సుల)తో సమంగా రెండో స్థానంలో ఉన్న అతడు.. తొలి సిక్సు బాది అతణ్ని దాటేశాడు. ఇక ఆ తర్వాత మరో 6 సిక్సులు రాబట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సుల రికార్డు పాక్ ప్లేయర్ షాహిద్ అఫ్రిది(351) పేరిట ఉంది. అఫ్రిది 369 ఇన్నింగ్స్ ల్లో, గేల్ 294 ఇన్నింగ్స్ లు ఆడి రికార్డు సాధిస్తే రోహిత్ కు మాత్రం 259 ఇన్నింగ్స్ లే అవసరమయ్యాయి.