ICC టోర్నీల చరిత్రలో రోహిత్ శర్మ విజయాల శాతం 90 శాతంగా నమోదైంది. మిగతా జట్ల వివరాలు చూస్తే… 1975-83 మధ్య 3 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ చేరింది వెస్టిండీస్. 17కు గాను 15 మ్యాచుల్లో గెలిచింది. 1975, 79 కప్పుల్లో ఓటమే లేని విండీస్.. 1983లో ఫైనల్ సహా రెండింట్లో భారత్ చేతిలోనే ఓడింది. ఆస్ట్రేలియా సైతం 1999, 2003, 2007 వరల్డ్ కప్ లు, 2006 ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. 2003, 2007లో అజేయంగా టైటిల్ ఎగరేసుకుపోగా.. ఆ 8 ఏళ్లల్లో 44కు 37 మ్యాచుల్లో గెలుపొందింది. పాంటింగ్ సారథ్యం(Captaincy)లో 5 ICC టోర్నీలాడితే గెలుపోటములు 30-3గా ఉన్నాయి. ఇంగ్లండ్ 2019 వరల్డ్ కప్, 2022 టీ20 ప్రపంచకప్ సాధించింది. ఆ టైంలో 23 ఆడితే 7 మ్యాచుల్లో ఓడింది. రోహిత్ కెప్టెన్సీలో జయాపజయాలు 27-3గా ఉన్నాయి. ధోని(41), పాంటింగ్(40) తర్వాత మూడోస్థానంలో ఉన్నాడతడు.
అత్యధిక టోర్నీలు గెలిచిన కెప్టెన్లు వీరే…
ఇమ్రాన్ ఖాన్(4)….: 1992 ODI వరల్డ్ కప్, 1986, 1990 ఆస్ట్రేలియా-ఆసియా కప్, 1989 వరల్డ్ సిరీస్
రికీ పాంటింగ్(4)….: 2003, 2007 వరల్డ్ కప్ లు, 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీలు
ఎం.ఎస్.ధోని(4)….: 2011 ప్రపంచకప్, 2007 టీ20 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2016 టీ20 ఆసియా కప్
రోహిత్ శర్మ(4)….: 2018, 2023 వన్డే ఆసియా కప్ లు, 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ