ఓపెనర్ స్మృతి మంధాన చెలరేగి ఆడటంతో ఢిల్లీ(DC) విధించిన టార్గెట్ చిన్నదైపోయింది. 142 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు(RCB)… కెప్టెన్ స్మృతి అండతో ఉఫ్ మని ఊదేసింది. మరో ఓపెనర్ వ్యాట్ హాడ్జ్(42) ఔటైనా మంధాన జోరు ఆగలేదు. 27 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆమె క్రీజులో ఉంటే ఎంతటి ప్రమాదకరమో మరోసారి నిరూపించింది. హ్యాడ్జ్ తో కలిసి ఫస్ట్ వికెట్ కు 107 రన్స్ పార్ట్నర్ షిప్ అందించింది. మరో 9 పరుగులు అవసరమైన దశలో మంధాన(81; 47 బంతుల్లో 10×4, 3×6) ఔటైంది. తర్వాత ఎలిసా పెర్రీ(6 నాటౌట్), రిచా ఘోష్(5 నాటౌట్) లాంఛనాన్ని(Formality) పూర్తి చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 146 స్కోరు చేసి 8 వికెట్ల తేడాతో భారీ గెలుపును దక్కించుకుంది.