వన్ డౌన్ బ్యాటర్ నితీశ్ రాణా(81; 36 బంతుల్లో 10×4, 5×6) వీరవిహారంతో రాజస్థాన్(RR) మంచి స్కోరు చేసింది. చెన్నై(CSK) బౌలర్లను ఉతికి ఆరేస్తూ ఎడాపెడా బౌండరీలు, సిక్స్ లు బాదాడు. అతడు కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీ అందుకుని దూకుడు మీదున్న దశలో స్టంపౌటయ్యాడు. జైస్వాల్(5), శాంసన్(20), పరాగ్(37), జురెల్(3), హసరంగ(4) ఔటవడంతో భారీ స్కోరుకు అడ్డుకట్ట పడింది. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, పతిరణ ముగ్గురూ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. చివరి ఓవర్లలో రన్స్ రాకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లకు 181 పరుగులే చేసింది.