మిగతా బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నా వికెట్ కీపర్ సంజూ శాంసన్ అర్ధ సెంచరీ(Fifty)తో క్రీజులో కుదురుకోవడంతో భారత్ మెరుగైన స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు.. 40 స్కోరుకే మూడు ప్రధాన వికెట్లు చేజార్చుకుంది. కానీ మరో 65 రన్స్ దాకా వికెట్ పడకుండా శాంసన్ అడ్డుగోడలా నిలబడ్డాడు.
ఓపెనర్లు సహా…
ఓపెనర్లు జైస్వాల్(12), గిల్(13), అభిషేక్(14) ఇలా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. కానీ శాంసన్(58; 45 బంతుల్లో 1×4, 4×6) మాత్రం పరాగ్(22), దూబె(26; 12 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. ముజర్బానీ రెండు వికెట్లు తీసుకున్నాడు. చివర్లో రింకూసింగ్(11 నాటౌట్)గా నిలిచాడు. దీంతో భారత్ 6 వికెట్లకు 167 పరుగులు చేస్తే… ముజర్బానీ రెండు వికెట్లు తీసుకున్నాడు.