ఆసియా క్రికెట్ కప్-2023 షెడ్యూల్ విడుదలైంది. మ్యాచ్ ల వివరాల్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) ప్రెసిడెంట్ జైషా ప్రకటించారు. సెప్టెంబరు 2న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది. ఆగస్టు 30న ముల్తాన్ లో పాకిస్థాన్, నేపాల్ మధ్య మ్యాచ్ తో టోర్నీ ప్రారంభమవుతుంది. సెప్టెంబరు 17న కొలంబోలో ఫైనల్ మ్యాచ్ జరగనుండగా… భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి. ఆరు దేశాలు తలపడుతున్న టోర్నీని హైబ్రీడ్ మోడల్ లో పాకిస్థాన్, శ్రీలంకల్లో నిర్వహిస్తున్నారు.
ఆసియా కప్ లో ఇప్పటివరకు భారత్ అత్యధికంగా ఏడు సార్లు టైటిల్స్ సాధించింది. ఇందులో ఆరు సార్లు వన్డేల్లో, ఒకసారి టీ20ల్లో ట్రోఫీలు దక్కించుకుంది. ఆరు టోర్నీలు గెలుచుకుని శ్రీలంక రెండో స్థానంలో నిలిచింది.