వెస్టిండీస్ తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరుగుతున్న రెండో టెస్టు(second test)లో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఫస్ట్ డే(first day) ఆట ఎండ్ అయ్యేసరికి టీమ్ ఇండియా 4 వికెట్లకు 288 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ తోపాటు విరాట్ కోహ్లి రాణించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్.. టీమ్ ఇండియా ప్లేయర్స్ ను తొలుత త్వరగా ఔట్ చేయలేకపోయింది. క్రీజులో పాతుకుపోయిన రోహిత్ (80; 143 బంతుల్లో 9×4, 2×6), యశస్వి(54; 74 బంతుల్లో 9×4, 1×6) తొలి వికెట్ కు 139 రన్స్ చేశారు. గిల్(10) త్వరగా ఔటైనా కోహ్లి(87 నాటౌట్; 161 బంతుల్లో 8×4) నిలబడ్డాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. అజింక్య రహానే(8) ఈ టెస్టులోనూ విఫలమవగా.. రవీంద్ర జడేజా(36) కోహ్లితో కలిసి క్రీజులో ఉన్నాడు.
139 పరుగుల స్కోరు బోర్డు వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయిన రోహిత్ సేన.. 43 పరుగుల వ్యవధిలో 182 రన్స్ చేరుకునేసరికి 4 వికెట్లు చేజార్చుకుంది. ఆరంభంలో వికెట్లు తీయలేకపోయిన విండీస్ బౌలర్లు తర్వాత పుంజుకున్నారు. రోచ్, గాబ్రియేల్, వేరికాన్, హోల్టర్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.