అద్భుత ఆటతీరుతో అఫ్గానిస్థాన్ ప్రపంచకప్ లో మరో అడుగు ముందుకేసింది. సూపర్-8లో చేరడమే గగనం అనుకుంటే ఆ స్టేజ్ ను దాటి, ఆస్ట్రేలియాకు చెక్ పెట్టి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ ఫలితం(Result) ఎలా ఉన్నా సరే.. కానీ రషీద్ ఖాన్ టీమ్ మాత్రం క్రికెట్ అభిమానుల్ని(Fans) అలరించింది. గ్రూప్-1 నుంచి మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన భారత్, అఫ్గాన్.. గ్రూప్-2 సెమీఫైనలిస్టులతో తలపడతాయి.
ఊరికే రాలేదు…
గ్రూప్ దశలో న్యూజిలాండ్, సూపర్-8లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి హుందాగా సెమీస్ చేరింది అఫ్గాన్. గ్రూప్-1లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన భారత్.. గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ను ఢీకొట్టనుంది. ఇక గ్రూప్-2లో అగ్రస్థానం(Top Place) దక్కించుకున్న దక్షిణాఫ్రికా.. గ్రూప్-1లో సెకండ్ ప్లేస్ లో ఉన్న అఫ్గానిస్థాన్ తో తలపడుతుంది.
తుది మ్యాచ్ ల షెడ్యూల్ ఇలా…
తేదీ(వారం) | మ్యాచ్ | ప్రత్యర్థులు | వేదిక |
జూన్ 26 బుధవారం | తొలి సెమీఫైనల్ | దక్షిణాఫ్రికా X అఫ్గానిస్థాన్ | గయానా(వెస్టిండీస్) |
జూన్ 27 గురువారం | రెండో సెమీఫైనల్ | భారత్ X ఇంగ్లండ్ | ట్రినాడాడ్ అండ్ టొబాగో(వెస్టిండీస్) |
జూన్ 29 శనివారం | ఫైనల్ | గ్రూప్ 1 X గ్రూప్ 2 సెమీస్ విజేతలు | బార్బడోస్(వెస్టిండీస్) |