అశేష భారతావని ఆశల్ని మోస్తూ బంగారు పతకమే ఖాయంగా ముందుకు సాగి చివరకు అనర్హత వేటుతో ఫైనల్ కు దూరమైన వినేశ్ ఫొగాట్.. సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ లో ఇక ఎంతోకాలం కొనసాగలేనని, ఆటకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది. ‘అల్విదా కుస్తీ 2001-2024’ అంటూ ట్వీట్ చేసి అందరి హృదయాలు బరువెక్కేలే చేసింది.
50 కిలోల ఫ్రీ-స్టైల్లో పోటీపడిన వినేశ్.. కేవలం 100 గ్రాముల ఎక్కువ బరువున్న కారణంగా ఫైనల్లో ఆడలేకపోయింది. తన అనర్హతను సవాల్ చేస్తూ CAS(కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్)ను ఆమె ఆశ్రయించింది. తీర్పు అనుకూలంగా వస్తే ఆమెకు రజత పతకం(Silver Medal) దక్కుతుంది. దీనిపై CAS తీర్పు రేపు రానుంది. కానీ ఒక అత్యుత్తమ క్రీడాకారిణి ఇలా ఆటకు గుడ్ బై చెప్పడం క్రీడా లోకాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.