అబ్బా.. ఏం జిడ్డురా నాయనా.. ఓ పట్టాన వదలడు.. అని అనిపించుకున్నవారెందరో. వయసు దాటి, ఫామ్ కోల్పోయి ఇంకా ఆడాలని తపిస్తున్న క్రికెటర్లకు భిన్నం కోహ్లి. టెస్ట్ క్రికెట్లో ఇంకా ఆడే సత్తా ఉండీ రిటైరవ్వడం సంచలనమైంది. నిజానికి విరాట్ కున్న ఫిట్నెస్(Fitness) ప్రపంచంలో మరే క్రికెటర్ కు ఆ వయసులో ఉండదేమో. కొత్త కుర్రాళ్లూ అలా మెయింటెయిన్ చేయడం కష్టం. ఇన్నాళ్లూ ఆట ద్వారా జేజేలందుకున్న అతడు.. ఎప్పుడు రిటైరవ్వాలో తెలిపి మరింత ఆదర్శమయ్యాడు. 14 ఏళ్లల్లో 123 టెస్టులాడితే 68 మ్యాచ్ లకు కెప్టెన్. 40 విజయాలుండటం అతడి నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. ఎక్కడా గర్వం చూపని కోహ్లి.. గ్రౌండ్ లో యువ ప్లేయర్లతో డ్యాన్సులేయడంలో దిట్ట. అందుకే మనం పాక్ పై యుద్ధం చేస్తున్నా.. అక్కడి దేశస్థులకు సైతం బాగా నచ్చిన భారత ఏకైక క్రికెటర్ కోహ్లినే.