
Published 19 Dec 2023
ఆటలోనైనా, దూకుడులోనైనా, చివరకు వేలంలోనైనా తమదే ఆధిపత్యమని ఆస్ట్రేలియా నిరూపించింది. IPL వేలంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆ దేశానికి చెందిన ఇద్దరు ప్లేయర్లు నయా రికార్డులు లిఖించారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రూ.20.5 కోట్లకు అమ్ముడుపోవడమే ఆశ్చర్యాన్ని తలపిస్తే అతణ్ని వెనక్కి నెట్టి తన సహచర ఆటగాడైన మిచెల్ స్టార్ట్ మరో సంచలనానికి కారణమయ్యాడు. రూ.24.75 కోట్లు పెట్టి స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.
ఆటగాళ్లు, వెచ్చించిన ధరలు చూస్తే…
క్రికెటర్ | దేశం | ధర(రూ.ల్లో) | యాజమాన్యం |
మిచెల్ స్టార్క్ | ఆస్ట్రేలియా | 24.75 కోట్లు | కోల్ కతా నైట్ రైడర్స్ |
ప్యాట్ కమిన్స్ | ఆస్ట్రేలియా | 20.5 కోట్లు | సన్ రైజర్స్ హైదరాబాద్ |
డారిల్ మిచెల్ | న్యూజిలాండ్ | 14 కోట్లు | చెన్నై సూపర్ కింగ్స్ |
హర్షల్ పటేల్ | భారత్ | 11.75 కోట్లు | పంజాబ్ కింగ్స్ |
అల్జారీ జోసెఫ్ | వెస్టిండీస్ | 11.5 కోట్లు | బెంగళూరు |
సమీర్ రిజ్వీ | భారత్ | 8.4 కోట్లు | చెన్నై సూపర్ కింగ్స్ |
రోమన్ పావెల్ | వెస్టిండీస్ | 7.4 కోట్లు | రాజస్థాన్ రాయల్స్ |
కుశాగ్ర | భారత్ | 7.2 కోట్లు | ఢిల్లీ క్యాపిటల్స్ |
ట్రావిస్ హెడ్ | ఆస్ట్రేలియా | 6.8 కోట్లు | సన్ రైజర్స్ హైదరాబాద్ |
శివమ్ మావి | భారత్ | 6.4 కోట్లు | లక్నో సూపర్ జెయింట్స్ |
శుభమ్ దూబె | భారత్ | 5.8 కోట్లు | రాజస్థాన్ రాయల్స్ |
గెరాల్డ్ కొయెట్జీ | దక్షిణాఫ్రికా | 5 కోట్లు | ముంబయి ఇండియన్స్ |
శార్దూల్ ఠాకూర్ | భారత్ | 4 కోట్లు | చెన్నై సూపర్ కింగ్స్ |
హ్యారీ బ్రూక్ | ఇంగ్లండ్ | 4 కోట్లు | ఢిల్లీ క్యాపిటల్స్ |
రచిన్ రవీంద్ర | న్యూజిలాండ్ | 1.8 కోట్లు | చెన్నై సూపర్ కింగ్స్ |
వనిందు హసరంగ | శ్రీలంక | 1.5 కోట్లు | సన్ రైజర్స్ హైదరాబాద్ |