
వెస్టిండీస్ తో టీ20 సిరీస్ ను భారత్ చేజార్చుకుంది. చివరి మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచి పుంజుకున్నట్లు కనిపించిన భారత్… అనూహ్య రీతిలో ఆఖరి మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. ఇండియా మొదట 9 వికెట్లకు 165 రన్స్ చేసింది. సూర్యకుమార్(61; 45 బంతుల్లో, 4×4, 3×6) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ 18 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ (85; 55 బంతుల్లో, 5×4, 6×6) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. భారత బౌలర్లను ఆటాడుకున్న కింగ్.. విండీస్ కు సిరీస్ ను అందించాడు. పూరన్ సైతం (47; 35 బంతుల్లో, 1×4, 4×6) కింగ్ కు సహకారమందించాడు.
రెండు జట్ల మధ్య జరిగిన టీ20 టోర్నమెంట్లలో విండీస్ కు కప్పు కోల్పోయింది ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. నాలుగు వికెట్లు తీసిన రొమారియో షెఫర్డ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, సిరీస్ లో 176 రన్స్ చేసిన నికోలస్ పూరన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్నాడు.