భారత జట్టుపై పాక్ మాజీల ప్రశంసలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘వరల్డ్ ఎలెవెన్(World Eleven)’ను సైతం ఈజీగా ఓడిస్తుందంటూ వెటరన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అన్నాడు. ‘ఛాంపియన్స్ గా నిలిచేందుకు టీమ్ఇండియా ఆటగాళ్లు 100 శాతం అర్హులు.. ఛాంపియన్స్ ట్రోఫీకి సరైన జట్టును ఎంపిక(Selection) చేశారు.. దుబాయి పరిస్థితుల్ని ముందుగానే గమనించి స్పిన్నర్లను దించారు.. అక్కడ ఆడిన అనుభవంతో చెబుతున్నా.. స్పిన్నర్లు ఎంతో కీలకం.. జట్టు మొత్తం స్ట్రాంగ్ గా ఉంది.. ‘వరల్డ్ ఎలెవెన్’ కూడా వారిని ఓడించలేదు.. నలుగురు స్పిన్నర్లతో భారత్ ఆడితే పాక్ మాత్రం ఒక్కర్నే నమ్ముకుంది..’ అంటూ టీమ్ఇండియాను ప్రశంసల్లో ముంచెత్తాడు.