వన్డే(ODI) క్రికెట్ చరిత్రలో మరో సంచలనం(Sensation) నమోదైంది. మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లు కలిపి అతి తక్కువ(Shortest Balls) బంతుల్లో ముగిసిన వన్డేగా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య కాన్ బెరాలో జరిగిన మూడో వన్డేలో ఈ చిత్రం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ టీమ్ వెస్టిండీస్ కు బ్యాటింగ్ అప్పగిస్తే.. ఆ జట్టు 86 పరుగులకే చాప చుట్టేసింది. మొన్న జరిగిన టెస్టు సిరీస్ లో కంగారూలపై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విండీస్ వీరులు… మూడో వన్డేలో మాత్రం ఆ పోరాటాన్ని ఎక్కడా చూపలేదు.
10 దాటింది ఇద్దరే…
కరీబియన్ ఆటగాళ్లలో 10 స్కోరు దాటినవారు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎలిక్ అథనేజ్(32), రోస్టన్ చేజ్(12) ఉన్నారు. మొత్తం ముగ్గురు డకౌట్ కాగా, ఒకరు సున్నాతో నాటౌట్ గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో జేవియర్ బార్లెట్ 4.. లాన్స్ మారిస్, ఆడమ్ జంపా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో 3 మ్యాచ్ ల సిరీస్ ను ఆసీస్ 3-0తో గెలుచుకోగా… మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ల్ని జేవియర్ బార్లెట్ సొంతం చేసుకున్నాడు.
ఇది మరో రికార్డు…
259 బాల్స్ మిగిలుండగానే ఆస్ట్రేలియా విజయం సాధించడం ఇదే తొలిసారి. ఆ జట్టు 2004లో USAపై 254 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందగా.. ఇప్పుడా రికార్డు తుడిచి పెట్టుకుపోయింది. ఇది వెస్టిండీస్ కు కూడా అవమానకర పరాజయమే. ఆ టీమ్ ఇంతకుముందు ఇదే కంగారూల చేతిలో 244 బాల్స్ ఉండగానే ఓటమి పాలయింది. 2013 పెర్త్ లో జరిగిన వన్డేలో 71 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 9.1 ఓవర్లలో ఛేదించింది.
Published 06 Feb 2024