ఓపెనర్ శుభ్ మన్ గిల్(Shubhman Gill) అద్భుత ఫామ్ ను కంటిన్యూ చేస్తూ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ తో అహ్మదాబాద్ లో జరుగుతున్న మూడోదైన చివరి వన్డేలో చెలరేగి ఆడాడు. కెప్టెన్ రోహిత్(1) మినహా టాప్ ఆర్డర్ అంతా రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. గిల్(112; 102 బంతుల్లో 14×4, 3×6), విరాట్(52), శ్రేయస్(78), కేఎల్ రాహుల్(40) రాణించారు. గిల్ కు అండగా విరాట్, శ్రేయస్ దూకుడుగా అర్ధసెంచరీలు పూర్తి చేశారు. 30.4 ఓవర్లలో 200 స్కోరు చేసిన భారత్.. 42.3 ఓవర్లలోనే 300 దాటింది. స్పిన్నర్ ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీసుకుని టీమ్ఇండియా స్పీడ్ ను అడ్డుకున్నాడు. 50 ఓవర్లలో రోహిత్ సేన 356కు ఆలౌటై ఇంగ్లండ్ ఎదుట భారీ టార్గెట్ ను ఉంచింది.