భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. తొలి 50 ఇన్నింగ్స్ ల్లో అత్యధిక పరుగులు(Highest Runs) చేసిన ఆటగాడిగా నిలిచాడు. అహ్మదాబాద్ మ్యాచులో సెంచరీ(112) చేసిన అతడు.. 50 ఇన్నింగ్స్ ల్లో 2,587 రన్స్ రాబట్టాడు. ఈ రికార్డు ఇప్పటిదాకా హషీం ఆమ్లా(దక్షిణాఫ్రికా) పేరిట ఉంది. అతడు 2,486 పరుగులు చేయగా, ఆమ్లా కన్నా 101 రన్స్ ఎక్కువ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు గిల్. ఇమామ్-ఉల్-హక్(పాక్) 2,386, ఫకర్ జమాన్(పాక్) 2,262, షాయ్ హోప్(వెస్టిండీస్) 2,247 పరుగులతో మూడు, నాలుగు, ఐదు స్థానాలను ఆక్రమించారు. 2019లో టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్న గిల్.. ఇప్పటివరకు 50 వన్డేలు, 32 టెస్టులు, 21 టీ20లు ఆడాడు. ఇక ఒకే వేదికపై మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా గిల్ రికార్డులకెక్కాడు.
మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన క్రికెటర్లు వీరే…
* ఫెఫ్ డుప్లెసిస్(దక్షిణాఫ్రికా)-వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్ బర్గ్(దక్షిణాఫ్రికా)
* డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)-ఆడిలైడ్ ఓవల్, ఆడిలైడ్(ఆస్ట్రేలియా)
* బాబర్ ఆజమ్(పాకిస్థాన్)-నేషనల్ స్టేడియం, కరాచీ(పాకిస్థాన్)
* క్వింటన్ డికాక్(దక్షిణాఫ్రికా)-సూపర్ స్పోర్ట్స్ పార్క్, సెంచూరియన్(దక్షిణాఫ్రికా)
* శుభ్ మన్ గిల్(భారత్)-నరేంద్రమోదీ స్టేడియం, అహ్మదాబాద్(భారత్)