పారిస్(Paris) పారాలింపిక్స్ లో భారత్ మరో స్వర్ణం గెలిచింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో నితేశ్ కుమార్ గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఫైనల్లో 21-14, 18-21, 23-21తో బ్రిటన్ షట్లర్ డేనియల్ బెథెల్ పై విజయం సాధించాడు.
పురుషుల(Men’s) డిస్కస్ త్రోలో ఈరోజు యోగేశ్ కథూనియా 42.22 మీటర్ల దూరం విసిరి రజత పతకం(Silver Medal) సాధించాడు. దీంతో పారాలింపిక్స్ లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో తొమ్మిది పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, మూడు రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.