భారత పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. మరోసారి వరల్డ్ నంబర్ వన్ గా నిలిచాడు. ఆసియా కప్ లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో 6 వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్నాడు. లేటెస్ట్ గా ICC ప్రకటించిన వన్డే ఇంటర్నేషనల్(One-day Internationals) వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో సిరాజ్.. మొదటి స్థానాన్ని(First Place) కైవసం చేసుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఆటోడ్రైవర్ కుమారుడైన సిరాజ్.. గత కొన్నేళ్లుగా భారత జట్టుకు కీలక సేవలు అందిస్తున్నాడు. ఓపెనర్ బౌలర్ గా ప్రత్యర్థి జట్లను కట్టిపడేస్తున్న సిరాజ్.. 694 పాయింట్లతో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్ వుడ్ నుంచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 678 పాయింట్లతో హేజిల్ వుడ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. టాప్-10లో మరో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కింది. 638 పాయింట్లతో కుల్దీప్ తొమ్మిదో ప్లేస్ లో ఉన్నాడు.
ఆసియా కప్ లో 12.20 యావరేజ్ తో సిరాజ్ 10 వికెట్లు తీశాడు. అంతకుముందు తొమ్మిదో స్థానంలో ఈ ఉన్న ప్లేయర్ శ్రీలంకతో ఫైనల్ లో 21 పరుగులకే 6 వికెట్లు తీసుకోవడం ద్వారా ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏకంగా నంబర్ వన్ కు చేరుకున్నాడు. ఆసియా కప్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబర్చిన అఫ్గానిస్థాన్ స్పిన్నర్లు ముజీబుర్ రహ్మాన్, రషీద్ ఖాన్ 4, 5 స్థానాల్లో నిలిచారు. తొలిసారి 2023 జనవరి నుంచి మార్చి మధ్యన ఈ హైదరాబాదీ ఆటగాడు కెరీర్లో నంబర్ వన్ గా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ఆ ప్లేస్ కు చేరుకున్నాడు.
ర్యాంకింగ్ బౌలర్ పాయింట్లు
1 మహ్మద్ సిరాజ్ 694
2 జోష్ హేజిల్ వుడ్ 678
3 ట్రెంట్ బౌల్ట్ 677
4 ముజీబుర్ రహ్మాన్ 657
5 రషీద్ ఖాన్ 655
6 మిచెల్ స్టార్క్ 652
7 మ్యాట్ హెన్రీ 645
8 ఆడమ్ జంపా 642
9 కుల్దీప్ యాదవ్ 638
10 షహీన్ షా అఫ్రిది 632